‘ఆ చివరి 50 నిమిషాలు’.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు
- ప్రేక్షకులు బరువెక్కిన గుండెతో బయటకు వస్తారన్న డైరెక్టర్
- ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని వెల్లడి
- గొప్ప సినిమా చూశామనే ఫీల్ ఖాయమని ధీమా
- జూన్ 4న సినిమా విడుదల
జూన్ 4న ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సనా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా స్కేల్, విజువల్స్ కంటే కూడా ఆయన చెప్పిన క్లైమాక్స్ ముచ్చట్లే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి.
‘పెద్ది’ సినిమా చివరి 50 నిమిషాలు బరువైన భావోద్వేగాలతో నిండి ఉంటుందని బుచ్చిబాబు తెలిపారు. ప్రేక్షకులు ఊహించని విధంగా షాకింగ్‌గా ఉంటుందని వెల్లడించారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ గొప్ప సినిమా చూశామనే అనుభూతి పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో వారి గుండె బరువెక్కుతుందని చెప్పారు. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాక కూడా మూవీలోని ఎమోషన్స్ ప్రేక్షకులను వెంటాడాలని తాను నమ్ముతానని వివరించారు.
కథలో బాధ, వాస్తవికత, ఎమోషన్స్ సహజంగా కుదిరినప్పుడే కమర్షియల్ సినిమా మరింత శక్తిమంతంగా మారుతుందని బుచ్చిబాబు అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఎమోషనల్ కథా విధానమే ‘ఉప్పెన’ సినిమాలో ఆయనకు పెద్ద విజయాన్ని అందించింది. పాత్రలను అర్థం చేసుకోవడానికి, వాటి ఎమోషనల్ జర్నీని స్క్రీన్‌పైకి తీసుకురావడానికి బుచ్చిబాబు ఎన్నో ఏళ్లు శ్రమించారు. కథలో ఉండే సహజత్వమే ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.
ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే పల్లెటూరి వాతావరణం, బలమైన పాత్రలు, విజువల్స్, తీవ్రమైన ఎమోషనల్ పాయింట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమా రొటీన్ కమర్షియల్ హై ఇవ్వకుండా ప్రేక్షకులను ఒక మంచి భావోద్వేగంలో ముంచెత్తుతుందని బుచ్చిబాబు సంకేతాలిచ్చారు.